ప్రభుత్వం పడిపోకుండా కార్లు, మనీ బ్యాగులు: నాగం

తెలంగాణ ఉద్యమాన్ని నష్ట పరిచేందుకు కాంగ్రెసు కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయ నాటకానికి తెరలేపిందని విమర్శించారు. నీచ రాజకీయాలు చేస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌లకు గాంధీ పేరు పెట్టుకునే అర్హత లేదన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు హిట్లర్ కంటే నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మరోసారి రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications