తెలంగాణ కాంగ్రెసు ఆఫీస్, అత్యుత్సాహమేనన్న గుత్తా

అయితే కొత్త పార్టీ పెట్టారా అని విలేకర్లు ప్రశ్నించడంతో గుత్తా అదేం లేదని తమ పార్టీ కార్యకర్తలు కొంత అత్యుత్సాహంతో పార్టీ పేరుకు తెలంగాణ తగిలించడంతో తెలంగాణ కాంగ్రెసు అయిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం రాకుంటే పార్లమెంటు సమావేశాలు అడ్డుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తమకు కొత్త పార్టీ పెట్టే యోచన లేదన్నారు.
అయితే మాజీ మంత్రి కోమటిరెడ్డిని దీనిపై ప్రశ్నిస్తే నో కామెంట్ అన్నారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకుంటే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసమే తాను రాజీనామా చేశానని చెప్పారు. ఇప్పటికే పదవులను త్యాగం చేసిన తాను ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు.












Click it and Unblock the Notifications