సీమాంధ్ర సిఎం మెప్పుకోసమే: జగ్గారెడ్డిపై హరీష్ రావు

జగ్గారెడ్డి ఎవరి కోసం ఉద్యమిస్తున్నారో చెప్పాలన్నారు. సీమాంధ్ర సిఎం, పెట్టుబడిదారుల మెప్పు కోసమే ఆయన ఉద్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. హరీష్ పాదయాత్రను అడ్డుకోవడానికి బయలుదేరిన జగ్గారెడ్డి వర్గం నేతలను పోలీసులు మధ్యలోనే అరెస్టు చేశారు. అరెస్టును నిరసిస్తూ జగ్గారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు.
జగ్గారెడ్డిపై టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై నిర్ణయం చెప్పమని గతంలో తాము ప్రశ్నించడానికి వెళితే పోలీసు స్టేషన్‌లో దాక్కున్నాడని విమర్శించారు. ప్రజా చైతన్యానికి అడ్డుపడితే జగ్గారెడ్డి రాజకీయ జీవితం కాలగర్భంలో కలిసి పోక తప్పదన్నారు. మమ్మల్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు.












Click it and Unblock the Notifications