కడపలోనే జగన్‌కు షాక్, కాంగ్రెసులోకి ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో ఉన్న వారు కడిగిన ముత్యంలా ఉండాలని విచారణకు భయపడకూడదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రగల్భాలు పలికిన జగన్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. విచారణ జరుపుతుంటే కోర్టులను, విచారణ సంస్థలను తప్పు పట్టడం సరికాదన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో సంపాదించిన ఆస్తులపై విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు.
కాగా బుధవారం జగన్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి తమ పార్టీలోకి రావడం కాంగ్రెసు పార్టీ ఘనతేనని మంత్రి సాకె శైలజానాథ్ చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వారు తిరిగి వస్తున్నారన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అదే చెప్పారు. జగన్ వర్గం నేతలు కొందరు తాము తిరిగి వెళ్లడం లేదని స్టేట్‌మెంట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెసు నేతలు మాత్రం వారొస్తున్నారని చెప్పడం విశేషం. అయితే కాంగ్రెసులోకి వస్తారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు మాత్రం స్పందించిన దాఖలాలు లేవు.












Click it and Unblock the Notifications