ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బకాయిలు విడుదల.. నేరుగా ఖాతాల్లోకి నగదు..!
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇటీవల ఉద్యోగుల కోసం ప్రమాద జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు కోసం 14 ప్రముఖ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. అలాగే తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జులై 15 నుండి అధికారికంగా ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పుడు ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు రూ. 2 వేల కోట్ల బకాయిలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా గత నెల 29 న మొదటి విడతగా రూ. 2 వేల కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత ఇవాళ రెండో విడతగా మరో రూ. 2వేల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమ పద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications