దమ్ముంటే నేరుగా తేల్చుకో: హరీష్‌కు జగ్గారెడ్డి వర్గం

Jagga Reddy
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు దమ్ము, ధైర్యం ఉంటే తమ నేతతో నేరుగా తేల్చుకోవాలని సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) వర్గం నేతలు గురువారం సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణ సాధన యాత్ర సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు జగ్గారెడ్డి ఫ్లెక్స్ చించడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. తమ నేత ఫ్లెక్సిని చించిన హరీష్ రావు పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. తాము వెయ్యి మందిమి ఐదువందల ద్విచక్ర వాహనాలపై చలో నర్సాపూర్ పేరుతో హరీష్ సాధన యాత్రను అడ్డుకునేందుకు వెళుతున్నామని చెప్పారు.

మమ్మల్ని అరెస్టు చేస్తారని వార్తలొస్తున్నాయని తాము అరెస్టులకు, జైళ్లకు వెళ్లేందుకు భయపడేది లేదన్నారు. జగ్గారెడ్డి ఫ్లెక్సి చించడం పిరికిపందల చర్య అని, మా నేతను ఎదుర్కోలేకే ఇలాంటివి చేస్తున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కెసిఆర్ కుటుంబ సభ్యులు కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్సేనన్నారు. టిఆర్ఎస్ తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. దమ్ముంటే హరీష్ సంగారెడ్డి వస్తే నువ్వో మేమో తేల్చుకుందామని మాకు సిద్దిపేట రావాల్సిన అవసరం లేదని నిత్యం నీకే సంగారెడ్డి రావాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణవాదం నీరుగార్చడానికి టిఆర్ఎస్ యత్నిస్తోందన్నారు. తెలంగాణ పేరు చెప్పుకునే మీకు అమర వీరుల స్థూపం కనిపించలేదా ఇక్కడ నివాళులర్పించాలన్న ఆలోచన రాలేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. ఖబర్దార్ హరీష్ అంటూ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+