గాలి జనార్దన్ రెడ్డి కోటలో సిబిఐ గూఢచారి పాగా?

బళ్లారిలోని గాలి భవనం ముందు కుటీరంలోకి సిబిఐ తన మనిషిని మూడో మనిషికి తెలియకుండా ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా ఆయన ఇంటిపై దాడులు చేయడానికి మూడు నెలల ముందు చేరినట్లు తెలుస్తోంది. సిబిఐ గూఢచారి క్రమంగా తన బాస్‌ల విశ్వాసాన్ని పొందడమే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి ఆంతరంగికులకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకుని అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిఐకి చేరవేస్తూ వచ్చాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా అతను వ్యవహరిస్తూ వచ్చాడు. నిజానికి, ఎవరి మీదనైనా అనుమానం వస్తే వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తారు.
సిబిఐ దాడులు జరగడానికి మూడు రోజుల ముందు సిబిఐ గార్డు ఆరోగ్యం, కుటుంబ సమస్యలు కారణంగా చూపి ఉద్యోగాన్ని వదిలేశాడు. అప్పుడు కూడా అతనిపై గాలి జనార్దన్ రెడ్డికి అనుమానం రాలేదు. ఇంటిపై దాడి చేసినప్పుడు సిబిఐ బృందంలో తన పాత ఉద్యోగి ఉండడం చూసి గాలి జనార్దన్ రెడ్డి షాకయ్యాడని ఆ ఆంగ్ల పత్రిక రాసింది. అత్యంత పకడ్బందీగా వ్యవహరించిన సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఆయనను అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications