వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు: డిఎల్

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు వైపే ఉంటారని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. వారంతా కాంగ్రెసు టికెట్ మీదే గెలిచారని, అందువల్ల వారంత కాంగ్రెసు వైపే ఉంటారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికార కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్‌లో అన్నారు. సిబిఐ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు అవిశ్వాస ప్రతిపాదన ప్రకటన చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శానససభలో చంద్రబాబుకు తగిన రీతిలో సమాధానమిస్తామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన చెప్పారు.
రైతు సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్‌లో అన్నారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎదుర్కునే సంఖ్యా బలం తమకు ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications