జగన్ వర్గం ఎమ్మెల్యేలను నమ్మొద్దు: మధు యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులను నమ్మొద్దని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. జగన్ వర్గానికి చెందిన శానససభ్యులకు నైతిక విలువలు లేవని, పార్టీకి తిరిగి వస్తామని వారు చెప్పినా నాయకత్వం నమ్మకూడదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన నాయకుడితో ఉంటే భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు తిరిగి కాంగ్రెసులోకి రావాలని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విశ్వాసం లేదని, ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వానికి తగిన సంఖ్యా బలం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+