రాష్ట్రం ఇస్తే తెలంగాణ నాయకులకు లాభం: లగడపాటి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయకూడదని అంటున్న బిజెపి తెలంగాణ ఇస్తానంటే ఎలా నమ్మడానికి వీలవుతుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తలపెట్టిన సద్భావనా యాత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా పాల్గొనాలని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల్లో శాంతి నెలకొంటేనే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అస్తులపై విచారణ జరిగితే తప్పేముందని ఆయన అడిగారు. సిబిఐ విచారణ ద్వారా చంద్రబాబు తన నిజాయతీని నిరూపించుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకోవాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి రావాలని తీసుకున్న నిర్ణయం సరైందని, వారు దాన్ని అవమానకరంగా భావించకపోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications