చంద్రబాబు, కెసిఆర్‌పై లక్ష్మణ్ బాపూజీ మండిపాటు

konda laxman bapuji
నెల్లూరు: కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే కాదని ఆంధ్రా, రాయలసీమ తదితర చిన్న రాష్ట్రాల కోసం పోరాడదామని ఇందుకోసం అందరూ రాజకీయాలకతీతంగా ఏకం కావాలని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదివారం అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన సద్బావన యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎన్ని ముక్కలైనా తెలుగువారంతా ఆత్మీయంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రభుత్వాలు విలువనివ్వడం లేదన్నారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఏర్పడిందని, అన్ని ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనే పాలకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై మెజార్టీ ప్రజల కోరికను ఆమోదించాల్సిన ప్రభుత్వాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

కొంతమంది నేతలు రాష్ట్ర విభజనను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సమైక్య వాదాన్ని ప్రజలు కోరుకోవడం లేదని, కేవలం పెట్టుబడిదారులు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయంగా కలిసి ఉండాలని చెప్పేందుకే సద్భావన యాత్రను ప్రారంభించామన్నారు. చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్న ఆయా ప్రాంతాల ఉద్యమకారులంతా కలిసి రావాలని కోరారు. ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఢిల్లీలో ఈనెల 24న సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+