ప్రత్యేక తెలంగాణపై శ్యామ్ బెనెగల్ నో కామెంట్

Shyam Benegal
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని ప్రశంసలతో ముంచెత్తిన ప్రముఖ సినీ దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనెగల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై మాత్రం మాట్లాడడానికి నిరాకరించారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు హాజరైన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో చూడని విశిష్టమైన, ప్రత్యేకమైన సంస్కృతి తెలంగాణదని, ఇదంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు మాత్రం - అది రాజకీయాంశమని, తాను దాంట్లోకి వెళ్లదలుచుకోలేదని, అయితే తనకు తెలంగాణ సంస్కృతి అంటే అమితమైన ఇష్టమనే విషయంలో మాత్రం సందేహం లేదని ఆయన సమాధానమిచ్చారు.

శ్యాం బెనెగల్‌కు హైదరాబాదు పునాదులున్నాయి. ఆయన సికింద్రబాదులో జన్మించిన ఇక్కడే చదువుకున్నరాు. ఆయన తొలి సినిమా ఆంకుర్, రెండో సినిమా మండీ హైదరాబాదులోనే నిర్మితమయ్యాయి. తర్వాతి సినిమాలకు సంబంధించి కూడా కొన్ని షాట్లను హైదరాబాదులో షూట్ చేశారు. తెలంగాణ పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, కొన్ని ఇతర ప్రాంతాలవారిలా తెలంగాణవారు అహంకారపూరితులు కారని ఆయన అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాన్ నెహ్రూ కూడా హైదరాబాద్ మిశ్రమ సంస్కృతిని ఎంతో ఇష్టపడేవారని ఆయన అన్నారు. బాలల అంతర్జాతీయ చలనచిత్రోత్సవం శాశ్వతంగా ఇక్కడ జరగడాన్ని తాను ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+