పిఒకెను పాక్ భూభాగంగా చూపిన అమెరికా నీతి

పిఒకెను వివాదాస్పద ప్రాంతంగా ఐక్య రాజ్య సమితి చెబుతోంది. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా పాకిస్తాన్‌కు అనుకూల వైఖరిని ప్రదర్శించింది. అమెరికా విదేశాంగ శాఖ వెబ్‌సైట్ చిత్రం పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదులతో, తాలిబాన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పాకిస్తాన్ పట్ల అమెరికా మెతక వైఖరి అవలంబిస్తోందని చెప్పడానికి ఇదో నిదర్శనమని భద్రతా నిపుణుడు ఎస్‌డి ప్రధాన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications