తెలంగాణపై బొత్స సత్తిబాబు ఎలా సర్ది చెబుతారు?

సీమాంధ్ర ప్రాంతంలోని నేతలలో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ప్రముఖ నేత బొత్స. వ్యక్తిగతంగా ఆయనకు తెలంగాణపై ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టాక అధిష్టానం మాటే ఆయన మాట కావాలి. పార్టీ నుండి తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాలేదు. పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఎస్సార్సీ పై గానీ, ప్రత్యేక సమైక్య రాష్ట్రం పై గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మన్మోహన్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఆయన ప్రధాని. అయితే ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని పార్టీని వేరుగా చూడలేరు.
ఇప్పటి వరకు బొత్స సీమాంధ్ర ప్రాంతంలో విస్తృత పర్యటనలు జరిపారు. త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరపనున్నారు. ప్రజలు ఆయనని తెలంగాణపై నిలదీసే అవకాశాలున్నాయి. ప్రధాని ప్రభుత్వ నేత అయినప్పటికీ ఆయన కాంగ్రెసు పార్టీ వ్యక్తి కాబట్టి పార్టీ నుండి ప్రకటన రాలేదని బొత్స చెప్పినా ప్రజలు నమ్మె పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు త్వరలో తెలంగాణ తేలుతుందని ప్రజలకు చెప్పిన బొత్స తన తెలంగాణ పర్యటనలో ఈసారి ప్రజలకు ఏం చెబుతారో?












Click it and Unblock the Notifications