బిజెపి నేత బంగారు లక్ష్మణ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కేసు స్థితిపై తాము ఏమీ మాట్లాడదలుచుకోలేదని, దాన్ని కింది కోర్టే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. విచారణను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో బంగారు లక్ష్మణ్ సుప్రీంకోర్టుకు ఎక్కారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ సిడిలను 2001 మే 13వ తేదీన విడుదల చేశారు. రాజకీయ దురుద్దేశాలతో సిబిఐ కేసులో పక్షపాత వైఖరిని అవలంబించిందని బంగారు లక్ష్మణ్ తన పిటిషన్‌లో ఆరోపించారు.












Click it and Unblock the Notifications