హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమంనుండి తప్పుకో: కెసిఆర్‌పై విరుచుకు పడ్డ టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu-Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆర్థికంగా లాభపడింది కెసిఆర్, టిఆర్ఎస్సే అన్నారు. ఉద్యమం పేరు చెప్పి కెసిఆర్‌లా తాము ఆస్తులు, పదవులు పొందలేదన్నారు. తెలంగాణ ద్రోహులెవరో చర్చించేందుకు టిఆర్ఎస్ సిద్దమా అని సవాల్ విసిరారు. టిఆర్ఎస్ గుంటనక్కలా వ్యవహరిస్తోందని, టిఆర్ఎస్ తప్ప తెలంగాణ కోసం ఇతరులు ఉద్యమిస్తే వారిపై దాడులు చేయడమే వారి సంస్కృతి అని విమర్శించారు. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డిని ఉద్యమంలో లేకుండా టిఆర్ఎస్ తొక్కి పెడుతోందన్నారు.

ఉద్యమానికి ఊపు తీసుకు రావడం ఆ తర్వాత దాన్ని తాకట్టు పెట్టడం కెసిఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. ఉద్యమం పేరుతో ఆర్థికంగా లాభపడిన కెసిఆర్ పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు పోడియం చుట్టుముడితే ఆయన మాత్రం తన సీటు వద్దే ఉండిపోయారన్నారు. ప్రధానమంత్రి తెలంగాణ ఇవ్వమని తేల్చి చెప్పాక సోనియాపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సోనియాతో కెసిఆర్ కుమ్మక్కయ్యారన్నారు. కెసిఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో టిఆర్ఎస్ స్థాపించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బాపూజీ నాయకత్వంలో జెండాలు, పార్టీలు పక్కన పెట్టి ఉద్యమించడానికి సిద్ధం కావాలన్నారు. లేదా కెసిఆర్ ఉద్యమం నుండి తప్పుకోవాలని హెచ్చరించారు.

English summary
TDP senior MLA Mothkupalli Narasimhulu and Errabelli Dayakar Rao fired at TRS chief K Chandrasekhar Rao. They demanded KCR to withdraw from Telangana stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X