సోనియాపై నమ్మకం ఉంది, అపోహలు వద్దు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తనకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై నమ్మకం ఉందని, పదవులపై అపోహలు వద్దని కాంగ్రెసు శానససభ్యుడు చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన గంగుల ప్రతాపరెడ్డి తన అనుచరగణంతో కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెసులో తాను చేరానని ఆయన చెప్పారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెసు పార్టీ పనిచేస్తోందని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెసులో చేరడం వల్ల లక్ష్యం వైపు వెళ్లడానికి బలం చేకూరుతుందని భావించానని ఆయన అన్నారు. తాను లక్ష్యం దిశగా ప్రయాణం సాగిస్తున్నానని ఆయన చెప్పారు.

సోనియా గాంధీ కేవలం చిరంజీవిని మాత్రమే చూడడం లేదని, చిరంజీవి వెనక ఉన్నవారిని కూడా చూస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల తన వెంట వచ్చిన వారికి ఎవరికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. గతంలో తన వైపు వచ్చినవారు స్వార్థంతో వచ్చారని తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకే భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంగుల ప్రతాపరెడ్డి అనుచరులతో పాటు తన సమక్షంలో కాంగ్రెసులో చేరాలని అనుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సభలో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+