కిరణ్‌కు పాస్ మార్కులేసిన జగన్ వర్గం నేత అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిత్యం విరుచుకు పడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం ఆయనకు పాసు మార్కలేశారు. అంబటి రాంబాబు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారానికి కిరణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయినందున ఆయన పని తీరుకు అంబటి 35 మార్కులేసి పాస్ చేశారు. కాంగ్రెసు పార్టీ నేత తులసి రెడ్డి మాత్రం వందకు వంద మార్కులేశారు. ఆయన క్రమంగా పుంజుకుంటున్నారని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. జగన్ ఎమ్మెల్యేలను కొందరినైనా తిరిగి రప్పించడంలో సఫలమయ్యారన్నారు.

ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారా అనే విషయం పక్కన పెడితే మంత్రులనే ఆయన ఆకర్షించలేక పోతున్నారని అలాంటప్పుడు పరిపాలన సూపర్బ్‌గా ఉందని ఎలా చెబుతారని అంబటి ప్రశ్నించారు. మంత్రివర్గంలోనే సమన్వయం లేదన్నారు. ముగ్గురు మంత్రులు రాజీనామా చేసినా వారి స్థానంలో మరొకరిని ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు. మంత్రులు శంకర్ రావు, శ్రీధర్ బాబు, డిఎల్ రవీంద్రా రెడ్డిలు సిఎం పట్ల అసంతృప్తితో ఉన్నారని, వ్యవసాయ మంత్రిని ఇప్పటి వరకు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని మరో నేత విమర్శించారు. అధిష్టానం జోక్యంతో కిరణ్ సర్దుకోగలుగుతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+