విజయమ్మ పిల్‌పై హైకోర్టుకు బాబు భార్య, కుమారుడు

Nara Bhuvaneshwari
హైదరబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్ణయించుకున్నారు. సిబిఐ, ఈడి, డిజిపి విచారణను సవాల్ చేస్తూ బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు లోకేష్ కుమార్ హైకోర్టులో వెకేట్ పిటిషన్ వేయనున్నారు. కాగా టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు, మరో నేత సిఎం రమేష్ వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ సీనియర్ కార్యకర్తలతో సుదీర్ఘ సమయం పాటు సమావేశమైన తర్వాత బాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

హైకోర్టుకు వెళ్లేందుకు బాబు తర్జన భర్జన పడుతున్నప్పటికీ రాజకీయంగా పార్టీకి ఎలాంటి నష్టం గానీ, ఇబ్బంది కానీ ఉండదని నేతలు ఆయనకు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రామోజీ రావు, నామా, సిఎం రమేష్ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు మీ వాదనలు వినాలని హైకోర్టుకు సూచిస్తామని చెప్పిందని ఇది మనకే ఫేవర్ అని వారు బాబుకు చెప్పినట్లుగా సమాచారం. దీంతో హైకోర్టుకు వెళ్లేందుకు బాబు సిద్ధమయ్యారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+