ఎంపి వర్సెస్ ఎమ్మెల్యే, జగన్ వర్గం నేత బాలినేని అరెస్టు

దీంతో బాలినేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వర్గం నేతలు బాలినేని వర్గాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గం నేతలు పోటాపోటిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు బాలినేని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎట్టకేలకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications