జ్యోతిర్మయి డే హత్య కేసులో లేడీ జర్నలిస్టు అరెస్టు

వోరా డే బైక్ నెంబర్‌ను, పొవాయిలోని డే నివాసం చిరునామాను చోటా రాజన్ గ్యాంగ్‌కు అందజేసినట్లు పోలీసులు చెప్పారు. ఆమె 2005, 2007 మధ్య కాలంలో ముంబై మిర్రర్‌లో పనిచేసింది. అక్కడే డేతో ఆమెకు పరిచయం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. డేను హత్య చేసిన షార్ప్ షూటర్లు ఛోటా రాజన్ గ్యాంగ్‌కు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో రోహీ థంగప్పన్ అలియాస్ సతీష్ కాల్యా, అభిజిత్ షిండే, అరుణ్ డాకే, సచిన్ గైక్వాడ్, అనిల్ వాఘ్మోడే, నీలేష్ షెంగ్డే, మంగేష్ అగవానే, వినోద్ ఆస్రానీ, పౌల్సన్ జోసెఫ్, దీపిక్ సిసోడియాలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications