ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

West Godavari
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు రచ్చబండ రసాభాసగా మారింది. స్థానిక శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్ ప్రజాసమస్యలను లేవనెత్తడంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. శానససభ్యుడు చింతమనేని ప్రభాకర్‌తో మంత్రి వట్టి వసంతకుమార్, పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వాదనకు దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చెలరేగింది. వట్టి వసంత కుమార్, ప్రభాకర్ మధ్య వివాదం పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరింది.

పరిస్థితి విషమిస్తున్నట్లు కనిపించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. శాసనసభ్యుడు ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణ చెలరేగడంతో రచ్చబండ కార్యక్రమం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+