గాలి జ్యుడిషియల్ కస్టడీ డిసెంబర్ 3వరకు పొడగింపు

గాలి జనార్దన్ రెడ్డి నివాసాల్లో, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న నగదును తమకు అప్పగించాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ ఆదాయం పన్ను శాఖ (ఐటి శాఖ) పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. తమకు గాలి జనార్దన్ రెడ్డి ఆదాయం పన్ను బాకీ పడినందున, సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదును అప్పగిస్తే భర్తీ చేసుకుంటామని ఐటి శాఖ అధికారులు అంటున్నారు. కాగా, గనుల అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ డిసెంబర్ 3వ తేదీ లోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. గడువులోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ అంటోంది.












Click it and Unblock the Notifications