మైసూరా రెడ్డి రాజ్యసభ సీటుకోసం నేతల ప్రయత్నాలు!

మళ్లీ తనకే ఇస్తానని బాబు అప్పుడే హమీ ఇచ్చినప్పటికీ మరోసారి గుర్తు చేయాలని భావిస్తున్నారట. మైసూరా కాకుండా ఆశావహులు పార్టీలో చాలామందే ఉన్నారు. టిడిపి సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు దీనిని ఆశిస్తున్నారు. సిఎం రమేష్ కూడా దీనిపై కన్నేశారు. గతంలో సుజనా చౌదరికి అవకాశం కల్పించినప్పుడు వచ్చేసారి తనకు అవకాశమిస్తానని అధినేత హామీ ఇచ్చారని పార్టీ నేతలకు చెబుతున్నారట. కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతం నుండి కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఈ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కడియం శ్రీహరి, చంద్రశేఖర్ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు ఆస్కారమున్న నేపథ్యంలో వీరిని పక్కకు పెట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ కోసం పార్టీ నేతలు ఎవరికి వారే నెమ్మదిగా పావులు కదుపుతున్నారు.












Click it and Unblock the Notifications