ఎన్నికలయ్యాక ఎవరైనా కొనవచ్చు: జగన్ నేతపై ఆనం

ఉప ఎన్నికల పేరుతో నల్లపురెడ్డి పారిశ్రామికవేత్తల నుంచి రూ.50 కోట్లు వసూలు చేశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యాభై కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రసన్న ఓ పొలిటికల్ వైట్ కాలర్ బ్రోకర్ అంటూ ధ్వజమెత్తారు. కాగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన నల్లపురెడ్డి జగన్‌కు మద్దతు పలకడం, ఆ తర్వాత రాజీనామా చేయడం తెలిసిందే. ఇటీవలె ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో కొవూరులో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications