ఇతరులకు మద్దతిస్తావా?: డికె అరుణ, జూపల్లి అరెస్టు

DK Aruna
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నీకు కాకుండా ఇతరులకెవరికైనా నీ నియోజకవర్గం నుండి టిక్కెట్ ఇస్తే మద్దతిస్తావా అని మంత్రి డికె అరుణ మంగళవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నించారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణపై ఎవరి విధానం వారికి ఉందని ఆమె అన్నారు. తెలంగాణ కోసం మా విధానాలపై మేం స్పష్టంగానే ఉన్నామన్నారు. జూపల్లికి తమను ఆదేశించే హక్కు లేదని ఆమె విమర్శించారు.

కాగా అంతకుముందు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు డికె అరుణ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా జూపల్లి కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు. మంత్రిని జూపల్లి అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని మహబూబ్ నగర్ పోలీసు స్టేషన్ తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+