అవిశ్వాసం పెడుతున్నాం: జగన్, కెసిఆర్‌కు బాబు సవాల్

రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. శని, ఆదివారాలు ఇప్పటి వరకు సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవని, కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే వారాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారని కాని కిరణ్ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తెలంగాణపై తమ వైఖరి ఇది వరకే చెప్పామని ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే అన్నారు. పరిష్కారం చూపించాల్సింది పోయి ఇతరులపై నెట్టడం సరికాదన్నారు. అవిశ్వాసంపై తమకు మద్దతిస్తే తీసుకుంటామని కానీ ఎవరిని సంప్రదించేది లేదన్నారు.












Click it and Unblock the Notifications