నాగంపై పోటీ పెట్టే అంశం తేల్చుకోలేక పోతున్న కెసిఆర్

పోటికి పెట్టకుంటే తమ ప్రభావం తగ్గిపోయే పరిస్థితి ఉందనే భావనలోనూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. టిడిపి నుండి బయటకు వచ్చిన జోగు రామన్న, గంపా గోవర్ధన్ ఇప్పటికే టిఆర్ఎస్‌లో చేరినందున వారు ఆ పార్టీ బి ఫారంపై పోటీ చేస్తారు. కానీ నాగం మాత్రం టిఆర్ఎస్ ఛాయలకు వెళ్లేందుకు ససేమీరా అంటున్నారు. తాను ఏ పార్టీతోను కలిసి పని చేయనని పలుమార్లు తేల్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తమ బి ఫారంపై పోటీ చేస్తే వెనక్కి తగ్గాలని లేకుంటే పార్టీ తరఫున మరో అభ్యర్థిని పోటీకి నిలపడమే మంచిదని పలువురు నేతలు కోరుతున్నారట.
అయితే పార్టీ వీడి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాగంపై పోటీ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతుందని మరికొందరు వాదిస్తున్నారట. దీంతో ఏం చేయాలో టిఆర్ఎస్ నాయకత్వం తేల్చుకోలేక పోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా జెఏసితో కలిసి పలు ఉద్యమాల్లో నాగం పాల్గొన్నారు. ఈ సమయంలో జెఏసి ఎవరికి మద్దతిస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పార్టీలకతీతంగా ఏర్పడిన జెఏసి నాగంపై పోటీ చేస్తే టిఆర్ఎస్‌కు మద్దతిచ్చిన పక్షంలో దాని విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications