సబితకు సిబిఐ క్లీన్ చిట్, శ్రీలక్ష్మి తప్పుడు సమాచారం

ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడారు. శ్రీలక్ష్మి నిందితురాలిగా తమకు బలమైన ఆధారాలు లభించాయని ఆమె గురించి తమకు కొందరు సమాచారమిచ్చారని ఆయితే వారి పేర్లు మాత్రం బయటపెట్టలేమని చెప్పారు. శ్రీలక్ష్మి హెల్త్ సర్టిఫికెట్స్ అన్నీ బోగస్ అని నలభై ఏళ్లు దాటితే సాధారణ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. గనులకు సంబంధించి చివరి దశలో ఆము అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. జీవో విడుదలలో శ్రీలక్ష్మిదే కీలక పాత్ర అన్నారు.
గనుల కేటాయింపులో సంబంధిత మంత్రికి పూర్తి సమాచారమివ్వలేదని చెప్పారు. శ్రీలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరించి కేటాయింపులు జరిపారన్నారు. వీటిలో మంత్రి ప్రమేయం లేదని అభిప్రాయపడ్డారు. కొందరికి మేలు చేసేందుకే శ్రీలక్ష్మి కేటాయింపులలో అత్యుత్సాహం ప్రదర్శించారని, కార్యదర్శి హోదాలోనే గనుల కేటాయింపు జరిగిందన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి స్థాయిలో కేటాయింపులు జరగవని చెప్పారు. మంత్రులను గైడ్ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. శ్రీలక్ష్మి తమకు విచారణలో కూడా ఎప్పుడూ సహకరించలేదని ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవారన్నారు.












Click it and Unblock the Notifications