మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందపై రేప్ కేసు

చిన్మయానందపై ఆరోపణలు చేస్తూ కొద్ది రోజుల క్రితం బదౌన్ నుంచి సంతకంతో కూడి సవివరమైన ఫిర్యాదు షాజహాన్‌పూర్ జిల్లా పోలీసు చీఫ్‌కు అందినట్లు వార్తలు వచ్చాయి. ఫిర్యాదు చేసింది మాజీ కేంద్ర మంత్రిపై కావడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆ బాలికను పోలీసు అధికారులు ఆదేశించారు. బుధవారం ఆమె పోలీసుల ముందుకు వచ్చింది. షాజహాన్‌పూర్ జిల్లాలోని ముముఖ్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ నేరాలు జరిగాయని ఆమె పోలీసు అధికారులకు చెప్పింది. తన పట్ల దుష్ప్రవర్తనకు విసిగిపోయి తాను ఆశ్రమాన్ని వదిలేసినట్లు ఆ బాలిక చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే చంపుతానని చిన్మయానంద తనను బెదిరించాడని ఆమె చెప్పింది. భయంతో తాను ఇన్నాళ్లు నోరు మూసుకుని ఆశ్రమం నుంచి పారిపోయినట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications