అసెంబ్లీ ప్రాంగణంలో నేతల కండువాల మార్పిడి

సమావేశాల అనంతరం కరీంనగర్ జిల్లా స్వతంత్ర్య ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గండ్ర వెంకటరమణా రెడ్డి వంటి కాంగ్రెసు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఓ కాంగ్రెసు ఎమ్మెల్యే సోమారపు మెడలో కాంగ్రెసు కండువా కప్పారు. వెంటనే సోమారపు తన మెడలో వేసిన కాంగ్రెసు కండువాతో పాటు అప్పటికే మెళ్లో ఉన్న గులాబీ కండువాను తీసి గండ్ర మెడలో వేశారు. మరో కాంగ్రెసు ఎమ్మెల్యే గండ్ర మెడలోని గులాబీ కండువా తీసి మళ్లీ సోమారపు మెడలో వేశారు. ఈ కండువాల మార్పిడి వారిలో నవ్వులు కురిపించడం విశేషం.












Click it and Unblock the Notifications