చిరంజీవి, పవన్ కళ్యాణ్ విభేదాల పుకార్లకు తెర

Pavan Kalyan and Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్, కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవితో తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన విభేదాలున్నాయని, కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒంటరివాడయ్యాడని చెలరేగుతున్న పుకార్లకు గురువారం తెర పడింది. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్, ఉపాసనల నిశ్చితార్థం ఆ పుకార్లకు తెర దించింది. తనకు అన్నయ్యతో ఏ విధమైన విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ మాటల్లో కాకుండా ఆచరణలో నిరూపించారు. పవన్ కళ్యాణ్ తమతో ఉన్నారని సినీ హీరో అల్లు అర్జున్ చెప్పినా, చిరంజీవి ప్రకటించినా మీడియాలో విభేదాల పుకార్లకు తెర పడలేదు. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ నిశ్చితార్థం కోసం ప్రత్యేకంగా ఖరీదైన కారును తెప్పించి, దానిలో రామ్ చరణ్ తేజ్‌ను నిశ్చితార్థం వేదిక వద్దకు తీసుకుని వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్‌కు ఏ విధమైన తేడాలు లేవని తేలిపోయిందని అంటున్నారు.

బాబాయ్ కారులో రావడం తనకు సంతోషంగా ఉందని రామ్ చరణ్ తేజ్ చెప్పగా, తమ కుటుంబానికి ఇది మంచి రోజు అని పవన్ కళ్యాణ్ ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దీన్నిబట్టి చిరంజీవితో పవన్ కళ్యాణ్‌కు విభేదాలు లేవని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. రాజకీయంగా అన్నయ్య అడుగులు నచ్చినా నచ్చకపోయినా కుటుంబ సంబంధాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో చిరంజీవి విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదని, అందుకే చిరంజీవికి దూరమయ్యారంటూ వార్తలు వచ్చాయి.

పంజా ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మీడియా అనేకార్థాలు తీసింది. వారసత్వం గురించి ఆయన మాట్లాడిన మాటలను చిరంజీవితో విభేదాలతో ఉన్నాయంటూ వ్యాఖ్యానించడానికి వాడుకుంది. పంజా ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడం కూడా ఆ మీడియా వ్యాఖ్యలకు ఊతమిచ్చాయి. ఏమైనా, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబ సభ్యులతో ఉన్నాడనే భావించే సంఘటనను రామ్ చరణ్ తేజ్ కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+