ఎఫ్‌డిఐకి వ్యతిరేకమే, ప్రభుత్వాన్ని పడగొట్టం: మమత

రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిపై తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆమె అన్నారు. దానిపై పునరాలోచన చేసి, వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రధానిని కోరారు. అవసరమైతే ప్రభుత్వం అన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించి, వాటి సూచనలు తీసుకుని, దాన్ని ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వాలని ఆమె అన్నారు. తమ పార్టీ వైఖరిని మార్చుకోవాలని ప్రధాని సూచించారని, కేంద్రమే పునరాలోచన చేయాలని తాను చెప్పానని, తమకు స్పష్టమైన వైఖరి ఉందని, తాము ఎన్నికల ప్రణాళికలోనే తమ వైఖరిని చెప్పామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications