తెలంగాణ తీర్మానంపై సిఎం కిరణ్ బెదిరింపు ధోరణి?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అన్నారు. వారి మాతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని చెప్పారు. అవిశ్వాసంపై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశ పెడితే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెప్పారు. అయితే అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలనేది స్పీకర్ నిర్ణయించుకోవాల్సిన అంశమన్నారు.
చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో ఎవరు ఉండాలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయించేది అధిష్టానమే అన్నారు. 108 సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ మేయర్ పదవిపై ఎంఐఎంకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications