హరీష్ రావును ఎందుకు అరెస్టు చేయలేదు?: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ఎస్సీ ఉద్యోగిపై దాడి చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావును ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బిసి వైద్యుడు చెరుకు సుధాకర్‌పై పిడి యాక్టు పెట్టిన ప్రభుత్వం హరీష్ రావును ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. కెసిఆర్ కుటుంబానికి ఓ న్యాయం మిగిలిన వారికి మరో న్యాయమా అని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానంలో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు.

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. టిఆర్ఎస్ సమావేశాలను అడ్డుకుంటే కాంగ్రెసుకు సహకరించినట్లేనన్నారు. తెలంగాణకు ఎవరు ద్రోహం చేశారో చర్చించేందుకు తాము సిద్దమన్నారు. కాగా అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఎర్రబెల్లి, దామోదర రెడ్డితో అసెంబ్లీ ప్రాంగణంలో మాటామంతి జరిపారు. తెలంగాణవాదంతో తాను ఆస్తులు కెసిఆర్‌లా ఆస్తులు సంపాదించుకోలేదని రు.2 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+