వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సిఎం గాలం

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసం చర్చకు వచ్చే నేపథ్యంలో శాసనసభ్యులను కూడగట్టుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తన సొంత బలాన్ని అలా ఉంచుకుని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు ఆయన గాలం వేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వాన్ని బలపరచాలని ఆయన వారికి సూచిస్తున్నారు. అందుకు అభివృద్ది తాయిలాలను ఎర వేస్తున్నారు. శాసనసభ్యులను కూడగట్టే పనిని జిల్లాల మంత్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి శానససభ్యురాలు కుంజా సత్యవతిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వచ్చారు. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన నలుగురు శానససభ్యులు కాంగ్రెసు వైపు వచ్చారు. జయసుధ, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కొర్ల భారతి, శేషారెడ్డి తాము కాంగ్రెసు వైపు ఉంటామని ఇది వరకే ప్రకటించారు.

తాజాగా, జగన్ వర్గం శానససభ్యులు బాలరాజు, గొర్ల బాబూరావు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. ఇదే సమయంలో తెలంగాణ తీర్మానాన్ని ముందుకు తెచ్చి అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు సహకరించాలని వారు తెరాస నాయకులను కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాల నిరూపణకు సిద్ధపడుతున్నాయి. తిరుగుబాటు శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారిలకు కూడా తెలుగుదేశం విప్ జారీ చేసింది. వారు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందేనని టిడిపి విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసింది.

కాగా, వైయస్ జగన్ గుంటూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాధ్యమైనంత ఎక్కువ మంది తన నుంచి జారిపోకుండా చూసునే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా తన శాసనసభ్యులతో ఓటు వేయించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు సిద్ధపడ్డాయి. సిపిఐ సభ్యులు నలుగురు ఉండగా, సిపిఎంకు ఒక్క సభ్యుడు ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+