బాబుపై రఘువీరా సెటైర్లు, రాజీనామా చేస్తామన్న టిడిపి

raghuveera reddy
హైదరాబాద్: అసెంబ్లీలో కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి రఘువీరా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ కూడా అందుకు ధీటుగానే స్పందించింది. తలపాగా చుట్టుకోవడం రాని బాబు రైతుపోరుబాట చేపట్టడం విడ్డూరమన్నారు. వ్యవసాయం దండుగ అన్న వారు ఇప్పుడు అదే రైతుల కోసమంటూ యాత్రలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. అందుకు టిడిపి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. స్పీకర్ వారిని అనునయించారు. రఘువీరా సెటైర్లకు మాజీ మంత్రి చంద్రశేఖర రావు ఘాటైన సమాధానాలిచ్చారు. మంత్రి పదవిలో ఉండి బుద్దిలేని వారు అనడం అన్ పార్లమెంటరీ అన్నారు. బాబు వ్యవసాయం దండుగ అన్నట్లు నిరూపిస్తే టిడిపి సభ్యులమంతా రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.

అందుకు ప్రతిగా రఘువీరా మాట్లాడుతూ తాను అన్న వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే ఉపసంహరించుకోవడానికి సిద్ధమన్నారు. ఆయన మాట్లాడుతుండగా టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. టిడిపి మాట్లాడేటప్పుడు మేం సావధానంగా విన్నామని కానీ మేం మాట్లాడేటప్పుడు వారు అరుస్తున్నారని ఇది వారి సంస్కారమని చురక వేశారు. బాబు తప్పు చేయకుంటే స్టే కోసం కోర్టుకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. తమ మంత్రికి క్లీన్ చిట్ ఇస్తే టిడిపి తప్పు పట్టడం సరికాదన్నారు. టిడిపికి న్యాయవ్యవస్థ, చట్టాలపైన నమ్మకం లేదా అన్నారు. వారి తీరు చూస్తుంటే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది మేమే అన్న నోరుమూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తనకు డాక్టరేట్ ఇచ్చిన విశ్వవిద్యాలయాన్ని అనుమానించడం సబబు కాదని ఏమైనా ఉంటే తనపై ఆరోపణలు చేసుకోవచ్చునని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+