తెలంగాణపై పిఎంది చౌకబారు ప్రకటన: మల్లేష్

తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకపోతే రాజకీయ సంక్షోభం రావణకాష్టంలా రుగులుతూనే ఉంటుందని ఆయన అన్నారు. కొంత మంది పెట్టుబడిదారులు తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం మొదలు కాదు, ఆఖరు కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంత్రులు పనిచేయలేని స్థితి ఉందని ఆయన అన్నారు. దానం నాగేందర్‌ను ఔట్ సోర్సింగ్ మంత్రి అంటే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజలను పట్టించుకోకూడదా అని ఆయన అడిగారు.
రూపాయికి కిలోబియ్యం ఇస్తే సరిపోదని, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణాలు లభించే స్థితి లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెసు పార్టీది దుర్మార్గమైన వైఖరి అని ఆయన అన్నారు. భూకుంభకోణాలు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. భూకుంభకోణాల మీద సభా సంఘం వేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం ఆహ్వాన పత్రంలో తన పేరు ఉందని, ఆ రచ్చబండ కార్యక్రమానికి తాను వెళ్తుంటే తనను అరెస్టు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇలా అవమానిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications