తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కుల్దీప్ నయ్యర్ వ్యతిరేకం

Kuldip Nayar
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు వ్యతిరేకంగా ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ స్పందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లను పరిష్కరించడానికి రెండో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిషన్ (రెండో ఎస్సార్సీ)ని వేయడమే శరణ్యమని, రెండో ఎస్సార్సీని వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన మంగళవారం అన్నారు.

తెలంగాణపై కేంద్రం ముందు ప్రకటన చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను సమర్థించబోనని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కేంద్రంపై భారం పడుతుందని, అది దేశ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+