అసెంబ్లీలో తేలిన జగన్ బలం, 19 మంది ఎమ్మెల్యేలు

YS Jagan
హైదరాబాద్: శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న శాసనసభ్యుల బలం తేలిపోయింది. జగన్ మాటకు కట్టుబడి 18 మంది ఇతర పార్టీల శాసనసభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు సభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అవిశ్వాసానికి తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 18 మందిలో 16 మంది శాసనసభ్యులు కాంగ్రెసుకు చెందినవారు కాగా, ఒకరు ప్రజారాజ్యం పార్టీకి, మరొకరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. శోభానాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీకి చెందినవారు కాగా, బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినవారు.

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శోభా నాగిరెడ్డి, బాబూరావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద రాజు, కొండా సురేఖ, సుచరిత, బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవ రెడ్డి, బాలనాగిరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెసుకు చెందిన 16 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కాంగ్రెసు పార్టీ నాయకులు తెగ ప్రయత్నాలు చేసినా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను ఎక్కువ మందిని తన వైపు లాక్కోలేకపోయింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు పూతలపట్టు రవి మాత్రం ఓటింగులో పాల్గొనకుండా సభకు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ తటస్థంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+