టన్నుల కొద్ది డబ్బుందని:జగన్‌ను కడిగి పారేసిన బొత్స

ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన ఉండదని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. తాను సంతకాలు సేకరించానని చెబుతున్నారని అలా సేకరించినట్లయితే ఆ కుటుంబంపై తనకు గౌరవం ఉన్నట్లే కదా అని చెప్పారు. జగన్ డబ్బు, పేరు మరేదైనా చూసి కొందరు ఎమ్మెల్యేలు ఆయన వైపు వెళ్లవచ్చునన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని చెప్పారు. మాకు విలువలున్నాయి, మేం విలువలు దిగజారిపోయి బ్రతకడం లేదన్నారు. మనమొక్కరమే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఊదరగొట్టడం సరికాదని జగన్‌కు హితవు పలికారు. మేం కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం లేదన్నారు. జగన్ వద్ద టన్నుల కొద్ది డబ్బు ఉంది కాబట్టే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని చూశారని విమర్శించారు.
కాగా పాయకరావు ఎమ్మెల్యే బాబూరావు బెదిరింపులపైనా వివరణ ఇచ్చారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కన్నారని విమర్శించారు. నేతల అవినీతి ఆరోపణలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications