చిరంజీవి ఇప్పుడు ప్రజలనడిగారా?: తలసాని శ్రీనివాస్

Talasani Srinivas Yadav
హైదరాబాద్: ప్రజల కోరిక మేరకే ప్రజారాజ్యం పార్టీ పెట్టానని ప్రకటించిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసే సమయంలో గానీ, అవిశ్వాస తీర్మానం సమయంలో గానీ అదే ప్రజలను అడిగారా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రశ్నించారు. గెలిపించిన ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎలా విలీనం చేశారన్నారు. విప్ జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై పార్టీ ఇంకా అనర్హత విషయమై నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.

ప్రతిదానికి అధిష్టానంపై భారం వేయడం శోచనీయమన్నారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి కూడా అధిష్టానం వైపు చూడటమేమిటని ప్రశ్నించారు. కాగా టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు వైయస్ జగన్ ఆస్తులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+