జగన్‌కు కెసిఆర్‌తో పోలిక తెచ్చిన మంత్రి టిజి వెంకటేష్

TG Venkatesh
హైదరాబాద్: చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి కొన్ని పోలికలు తీసుకు వచ్చారు. జగన్ సిఎం పదవి కోసం కాంగ్రెసు పార్టీని వీడితో కెసిఆర్ మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టారని ఆరోపించారు. ఇద్దరి లక్ష్యం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడమేనని ఆరోపించారు. వారికి సెంటిమెంట్లతో ఓట్లు అడగటం తప్ప ప్రజలకు సహాయం చేయాలని ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు.

జగన్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వస్తామని చెబుతున్నారని కానీ వారు జగన్‌తో సహా వస్తేనే ఆలోచిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలను రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. వారిపై వేటు వేసే అంశం కొద్దిగా ఆలస్యమైనా కఠినచర్యలు తీసుకోవడం మాత్రం తథ్యమన్నారు. ఆ ఎమ్మెల్యేలను క్షమించే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీలోకి రావాలని తాము ఎవరినీ ప్రలోభ పెట్టలేదని చెప్పారు. జగన్ వర్గానికి సెంటిమెంటుతో ఓట్లు పడే అవకాశం లేదని, సెంటిమెంట్ కోసం గ్లిజరిన్ రాసుకొని సెంటిమెంట్ పండించాల్సిందేనని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+