బొత్సకు జగన్ వర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు కౌంటర్

Kadapa
కడప: రాష్ట్ర అసెంబ్లీలో వైయస్సార్ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడిన తీరుపై వైయస్ జగన్ వర్గానికి చెందిన రైల్వే కోడూరు కాంగ్రెసు శాసనసభ్యుడు కె శ్రీనివాసులు మండిపడ్డారు. విజయమ్మ పట్ల బొత్స మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు శుక్రవారం అభిమానులు, కార్యకర్తల నుంచి స్వాగతం లభించింది.

వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతోనే తాము అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామని ఆయన చెప్పారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+