ఎవరికీ దొరక్కుండా ఫామ్ హౌస్‌లో కెసిఆర్ విశ్రాంతి

24 ఎకరాల ఈ క్షేత్రంలో గెస్ట్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. రాజీవ్ రహదారిపై వచ్చి వెళితే అందరికీ తెలుస్తుందని భావించారేమో, ఇంటర్నల్ రోడ్డుపై ప్రయాణించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సికింద్రాబాద్, ఈసీఐఎల్, కీసరల మీదుగా ములుగు మండలం కాశిరెడ్డిపల్లి, దామరకుంట, వడ్డెరాజుపల్లి మీదుగా ఇక్కడికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే దారిలో వెళ్లారు. ఈ ప్రయాణానికి ఆయన తాను సాధారణంగా వాడే ఇన్నోవా వాహనాన్ని వాడలేదు. పోలీస్ ఎస్కార్టును సైతం పక్కన పెట్టారు.
బ్లాక్ కలర్ స్కార్పియోలో, కేవలం అంగరక్షకులను మాత్రమే వెంటబెట్టుకుని వచ్చారు. వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఫెన్సింగ్ ఉండగా, ప్రవేశ ద్వారం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని నియమించి భద్రత కట్టుదిట్టం చేశారు. అజ్ఞాతవాసంలో భాగంగా ఇక్కడ ప్రశాంతంగా గడిపిన ఆయన ఉద్యమ కార్యాచరణ కోసం ముఖ్యనాయకులతో ఫోన్‌లో మంతనాలు సాగించారనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications