సుదీర్ఘ చంద్ర గ్రహణం: శ్రీవారు సహా దేవుళ్లకు విశ్రాంతి

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసేశారు. శనివారం ఉదయం పది గంటలకే ఆలయాన్ని మూసేశారు. రేపు 11 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా మూసేశారు. గ్రహణ దోష పూజలు, సంప్రోక్షణ అనంతరం ఆదివారం ఉదయం ఆలయాన్ని తెరుస్తారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఆలయాన్ని, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయాన్ని కూడా మూసేశారు. శ్రీమల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా గ్రహణం సందర్భంగా మూసేశారు. రేపు ఉదయం 9 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. మిగతా ఆలయాలు కూడా మూత పడ్డాయి.












Click it and Unblock the Notifications