జగన్ కేసు, సిబిఐ దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అతిగా వ్యవహరిస్తోందంటూ జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు సిబిఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో అతి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆ కౌంటర్‌లోని అంశాలు ఇలా ఉన్నాయి.

- జగన్మోహనరెడ్డి కంపెనీల్లో నాటి సీఎం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందిన పలువురు వ్యక్తులు, సంస్థలు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టారన్న (క్విడ్ కో ప్రో) అంశంపై సీబీఐ విచారణ జరుపుతోంది.

- హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు పదో తేదీన జగన్ ఏ1, విజయసాయిరెడ్డి ఏ2గా మరో 72 మందితో ఎఫ్ఐఆర్ జారీ అయ్యింది.

వీరందరిపై ఐపీసీ 120బి రెడ్‌విత్ 420, 409, 420, 477ఎతో పాటు అవినీతి నిరోధకచట్టం 13(2), రెడ్‌విత్ 13(1) (సి), (డి) ప్రకారం కేసు నమోదైంది.

- జగన్ కంపెనీల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారు అత్యధిక ప్రీమియంతో షేర్లు కొన్నట్లు చూపి పెట్టుబడులు పెట్టారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి. మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారు. విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి.

- 2007-08లో జగన్మోహనరెడ్డి సండూర్ పవర్‌కు చెందిన 82 లక్షల షేర్లను ఒకో షేరు రూ. 675 చొప్పున మోసపూరిత లావాదేవీల్లో భాగంగా తాను సృష్టించిన జడ్ఎం ఇన్ఫోటెక్, నెల్‌కాస్ట్ ఫైనాన్స్, ఎక్సెల్ ప్రోసాఫ్ట్, సాయి సూర్య వేర్ హౌసింగ్, సిగ్మా ఆక్సిజన్ కంపెనీలకు అమ్మారు. ఈ కంపెనీలన్నీ ఆ తర్వాత కెల్విన్ టెక్నాలజీస్‌లో విలీనమయ్యాయి. కెల్విన్ టెక్నాలజీస్‌లో జగన్‌కు ప్రధాన వాటా ఉంది. విలీనమైన కంపెనీలకు రూ. 4 కోట్లు చెల్లించినట్లు చూపించారు. సండూర్ పవర్‌లో ఈ కంపెనీలు రూ. 533 కోట్లు పెట్టుబడి పెట్టగా టేకోవర్‌కు ఖర్చుపెట్టింది నాలుగు కోట్లే.

- ఇలాగే నిమ్మగడ్డ ప్రసాద్ 21.42 లక్షల షేర్లను ఒక్కో షేర్ రూ. 650 చొప్పున రూ. 140 కోట్లు ఖర్చు పెట్టి సండూర్ పవర్ నుంచి కొన్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు వాన్‌పిక్ ప్రాజెక్టు పేరుతో 15 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

- దర్యాప్తులో భాగంగా కోర్టు నుంచి అనుమతులు పొంది వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం.

- ఆగస్టు 18వ తేదీన బెంగళూరులోని సండూర్ పవర్ కంపెనీ, బంజారాహిల్స్‌లోని వీఎస్ రెడ్డి అసోసియేట్స్, చెన్నైలోని విజయ సాయిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి నేర నిర్ధారణకు అవసరమైన కీలక పత్రాలు సేకరించాం.

- వీటన్నింటినీ ఆగస్టు 23వ తేదీన కోర్టుకు అందజేశాం. ఆగస్టు 18న స్వాధీనం చేసుకున్న కీలక ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి పంపించాం.

సీబీఐ దర్యాప్తు కీలకదశలో ఉన్న సమయంలో పిటిషనర్ దర్యాప్తునకు విఘాతం కలిగించే ఉద్దేశంతో సాక్షులపై సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారని, వాస్తవానికి సీబీఐ మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదనిస ఎలాంటి కేసు నమోదు కాలేదని అంటూ ఒత్తిడి చేసినట్లు పిటిషనర్ కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కోరుతున్నామంటూ సీబీఐ ఎస్‌పీ వెంకటేష్ నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+