చిరుకు సోనియా పిలుపు: పదవిపైనా, తెలంగాణపైనా?

చిరంజీవికి, ఆయన వర్గం శాసనసభ్యులకు పదవులు ఇవ్వడంలో జరిగిన జాప్యంపై సోనియా వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంత కాలం ఓపిక పట్టాలని ఆమె చిరంజీవికి సర్దిచెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, తెలంగాణ అంశంపై కూడా మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలంగాణపై చర్చించిన అధిష్టానం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ చిరంజీవితోనూ మాట్లాడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీకి సంబంధించిన చిరంజీవిని ముఖ్యమైన నేతగా భావిస్తుండడం వల్ల ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
చిరంజీవి సమైక్యాంధ్రకే ఓటు వేస్తానని చెబుతూనే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. దానికితోడు, తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం చేయకూడదని ఆయన కోరుతున్నారు. ఇది వరకు సోనియా, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications