అక్రమాల వల్లే సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ పేరు: విహెచ్

రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం సంకీర్ణంలో పడిపోయినందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసుతో విభేదించినప్పుడు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆ 16 మంది శాసనసభ్యులపై చర్య తీసుకుని ఉప ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవారికి శిక్ష పడితేనే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెసుకు అవకాశాలుంటాయని ఆయన అన్నారు. తక్కువ ధరలే విల్లాలు అమ్మడం ద్వారా కొల్లగొట్టిన 800 కోట్ల రూపాయలు ఎక్కడ దాచారో కోనేరు ప్రసాద్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications