వైయస్ జగన్ కేసు, వైయస్ కుట్రదారుడేనని సిబిఐ

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ కుట్రదారుడేనని, కానీ ఆయన మరణించారు కాబట్టే ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించలేదనిస నిందితుల జాబితాలో వైఎస్ పేరును పేర్కొనలేదని సిబిఐ తెలిపింది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి సీబీఐ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని, ఒకసారి కాదు.. వందసార్లు ఆయన సీబీఐ ముందు హాజరైనా కూడా అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం లేదని సీబీఐ తరఫు న్యాయవాదులు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు నివేదించారు.సీబీఐ తన పరిధి దాటుతోందని, సాక్షులను బెదిరిస్తోందని విజయసాయిరెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలంటూ శుక్రవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రోజువారీ పద్ధతిలో సీరియస్‌గా జరుగుతోందని, ఇప్పటి వరకు జరిగిన విచారణలో సీబీఐ ఏనాడూ ఎవరినీ బెదిరించలేదు, భయపెట్టలేదు, ఒత్తిడి చేయలేదనిస అలాంటిదేమైనా ఉంటే సాక్షులు పోలీసులకు లేదా హైకోర్టుకు ఫిర్యాదు చేసేవారని సిబిఐ స్పష్టం చేసింది. ప్రధాన దర్యాప్తును తప్పుదోవ పట్టించడంతో పాటు సీబీఐ విచారణను అడ్డుకునే ప్రయత్నంలోనే విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారని, హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే సీబీఐ జగన్ అక్రమాస్తులపై ఆర్‌సీ నెంబర్ 19 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది. 2004 కంటే ముందు విషయాలపై దర్యాప్తు చేయొద్దని సీబీఐకి హైకోర్టు సూచించలేదని స్పష్టం చేసింది.

నేరం జరిగినప్పుడు ఆ నేరం ఎప్పుడు జరిగింది? నేరానికి దారితీసిన మూలాలేంటన్న విషయాలను తెలుసుకోవడం దర్యాప్తు అధికారుల బాధ్యత అని, అదేక్రమంలో విజయసాయిరెడ్డి తదితరులను సీబీఐ ప్రశ్నించిందని న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతి శర్మ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+